Oct 26,2023 08:04
  •  ఎస్‌ఐను విఆర్‌కు పంపుతూ ఎస్‌పి ఉత్తర్వులు

ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : కూలి పని కోసం వెళ్లిన గిరిజన మహిళలపై దొంగతనం కేసు మోపి నేరం అంగీకరించాలంటూ నిర్బంధించి చితకబాదిన ఘటనలో బాధితులకు న్యాయం జరిగేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మహిళలపై దాడి ఘటనలో కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామ వైసిపి కన్వీనర్‌ మత్తి రాజాచంద్‌ను పోలీసులు అవనిగడ్డ కోర్టులో హాజరుపర్చగా బుధవారం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు మహిళలపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ పద్మను విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్‌పి జాషువా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మూడు రోజులపాటు నిర్బంధంలో ఉండి చావు దెబ్బలు తిన్న గిరిజన మహిళలు ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జ్‌ కాకుండానే నిందితుడు బెయిల్‌పై బయటకు రావడం పట్ల ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం, పీడత వర్గాలకు మరో న్యాయం అన్నట్టుగా వైసిపి పాలన నడుస్తోందని తెలిపారు.