Aug 04,2023 22:54

ప్రజాశక్తి-గన్నవరం (హనుమాన్‌ జంక్షన్‌) :హర్యానాలో జరిగిన మత దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం హనుమాన్‌ జంక్షన్‌ లో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి నల్ల ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు బాగా పెరిగాయన్నారు. మణిపూర్‌లో జరిగిన ఆకృత్యాలను దేశమంతా చూశాయని, మణిపురంలో శాంతిని నెలకొల్పాలని ర్యాలీలు బహిరంగ సభలో చేపట్టిన ప్రభుత్వానికి కనీసం కనికరం లేకుండా ఈ విషయాన్ని కనీసం ఖండన కూడా చేయకుండా పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం పై కూడా చర్చి జరగకుండా చేయడం దారుణమన్నారు. అదే విధంగా ఈ రోజున హర్యానాలో ముస్లిం ప్రార్థన మందిరాలపై దాడిని అక్కడ జరుగుతున్న మైనార్టీలకు పై దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాలని, దీనికి కారణమైన వారిని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి తోట సాంబశివరావు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కోరం రవికుమార్‌ బిల్డింగ్‌ మండల అధ్యక్షుడు చింతా వీర రాఘవయ్య కోశాధికారి నాగేశ్వరరావు నోచర్ల నాగేశ్వరావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బేతా శ్రీనివాసరావు కెవిపిఎస్‌ నాయకులు కొత్తూరు కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.