May 02,2023 09:55

మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

          హిందూపురం : బిజెపి ఫతనం కర్నాటక ఎన్నికల నుంచే ప్రారంభం అవుతుందని ఎపి పిసిసి అద్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళుతూ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాలాజీ మనోహర్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ డంఖా మోగిస్తుందన్నారు. ఎఐసిసి సూచనల మేరకు కర్ణాటక సరిహద్దులోని తెలుగు ప్రజలను ప్రభావితం చేసి మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పొత్తు లేకుండా కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఏపీ ప్రజలు మరో అవకాశం ఇవ్వరన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి మెంబర్‌ కెటీ శ్రీధర్‌, కాంగ్రేస్‌ నాయకులు బాలాజి మనోహర్‌, అమనూల్లా, మూనూస్‌, జమీల్‌ తదితరులు పాల్గోన్నారు.