బిజెపి ఎంపీని అరెస్టు చేయాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
- మహిళా రెజర్లకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
- బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ దిష్టిబొమ్మ దహనం
ప్రజాశక్తి - నంద్యాల
అంతర్జాతీయంగా భారతదేశానికి కుస్తీ పోటీల్లో పథకాలు సాధించి పెట్టిన రెజ్లర్లపై లైగింక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసిన కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా ఇంతవరకు బిజెపి ఎంపీని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. మే 28న ప్రజాస్వామ్య దేవాలయం పేరుతో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన మోడీ ప్రజాస్వామ్య యుతంగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారులపై పాశవికంగా వారిని ఈడ్చుకుంటూ, ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. రెజ్లర్లు 40 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో వారు పతకాలను గంగలో కలిపేస్తామని అంటున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎంపీ పార్లమెంటు భవనం ముందు ఫోజులిస్తుంటే దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కుస్తీయోధులకు దేశ వ్యాప్తంగా రైతాంగం, కార్మిక వర్గం, మహిళలు, మేధావులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారులు కూడా మద్దతు తెలపాలన్నారు. బేటి పడావో బేటి బచావో నినాదం కేవలం ప్రచారానికే పరిమితమై, మహిళలపై ఇలాంటి వేధింపులు జరుగుతున్నా బిజెపి ఎంపీని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బిజెపి ఎంపీని అరెస్ట్ చేసేంతవరకు వారి ఆందోళనకు పార్టీ, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రజలందరూ వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహ, సిఐటియు జిల్లా నాయకులు తోటమద్దులు, కెఎండి గౌస్, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓ లక్ష్మణ్, నాయకులు వెంకట లింగం తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు : రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు డిమాండ్ చేశారు. నందికొట్కూరులో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం, బిఎస్‌పి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, బిఎస్‌పి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి ఎల్. స్వాములు, సిఐటియు జిల్లా నాయకులు కే భాస్కర్ రెడ్డి, గోపాలకృష్ణ మాట్లాడారు. సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ఆంజనేయులు, ఆర్ జయరాణి, కే వెంకటేశ్వర్లు, నాగన్న, బి శ్రీనివాసులు, ఎల్లా నాగన్న రామచంద్రుడు, కేశవ్ గౌడ్, రాజు, నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరి వర్ధన్, శేషాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర రావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్సార్ రమణ, బాల యేసు సిఐటియు నాయకులు సి హనుమంతు, మైనార్టీ సంఘం నాయకులు షర్ఫుద్దీన్ అలీ, ఉస్మాన్ బాష, మక్బూల్ బాష, బీసీ సంఘం నాయకులు, మద్దిలేటి, బాలకృష్ణ, ఆనంద్ గౌడ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వెలుగోడు : వెలుగోడులో కెవిపిఎస్, సిఐటియు ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామదాసు మాట్లాడారు. కార్యక్రమంలో కెవిపిఎస్, సిఐటియు నాయకులు ఎర్ర బాష, రామకృష్ణ, కృష్ణ, నూరుల్లా, సుబ్బయ్య, పకీరయ్య, భాస్కర్, ఆంజనేయులు, సుధాకర్, ఇస్మాయిల్, ఖాదర్ బాషా, వెంకటయ్య, శివరాం, ముజాఫ్, కేశాలు తదితరులు పాల్గొన్నారు.










