Jul 07,2023 19:53

కరపత్రాలను పంపిణీ చేస్తున్న బీడీ కార్మికులు, సిఐటియు నాయకులు

       కదిరి టౌన్‌ : బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఈనెల 13వ తేదీన నెల్లూరులో జరిగే బీడీ కార్మికుల సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆంధ్రప్రదేశ్‌ బీడీ కార్మిక సంఘం నాయకులు శుక్రవారం కదిరి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి బీడీ కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం నాయకురాలు నూర్జహాన్‌, ఫాతిమా, అమ్మాజాన్‌, దిల్షాద్‌, సిఐటియు నాయకులు జగన్మోహన్‌, బాబ్జాన్‌, రామ్మోహన్‌, ఫైరోజ్‌, ఫాజిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులుకు యజమానులు సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదన్నారు. దినసరి కూలీలుగా పని చేస్తున్నవీరిని ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. బీడీ కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పక్కా ఇల్లు, పెన్షన్‌ లాంటి పథకాలు అమలు చేయాలన్నారు. కదిరిలో బీడీ కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీడీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి నెల్లూరులో జరుగుతున్న సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు.