బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. మూడు నెలలకు కేవలం రూ.100లకే రీఛార్జ్ లభించనుంది. సాధారణంగా ఏ నెట్ వర్క్ అయినా.. మూడు నెలల ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాలంటే కనీసం రూ.300పై మొత్తంతో రీచార్జ్ చేసుకోవాల్సిందే. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ ఆఫర్‌తో కేవలం మూడు నెలలకు వంద రూపాయల రీఛార్జ్ మాత్రమే కాకుండా.. మొదటి వంద నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. 100 ఉచిత నిమిషాలు అయిపోయాక లోకల్ కాల్స్‌కు నిమిషానికి రూ.1, ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి రూ. 1.3 చెల్లించాల్సి ఉంటుంది. ఇక లోకల్ ఎస్‌ఎంఎస్‌కు రూ.0.8, నేషనల్ ఎస్‌ఎంఎస్‌కు రూ.1.2 చొప్పున చార్జ్ చేస్తారు. అలాగే ఈ ఆఫర్ ద్వారా 3జిబి డేటా కూడా లభించనుంది. ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఈ ఆఫర్ లభించదు.










