Aug 27,2023 22:53

ప్రజాశక్తి మచిలీపట్నం రూరల్‌ : వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏమినిటీస్‌ సెక్రెటరీలను బి ఎల్‌ వో విధుల నుంచి మినహాయింపునివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ డెమోక్రటిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీనా రాయణ, జిల్లా అధ్యక్షుడు శివరామకష్ణ పేర్కొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని సచివాల యాల్లో పని చేస్తున్న ఎమినిటీస్‌ సెక్రటరిలు డెమోక్రటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మచిలీపట్నం తహసీల్దార్‌ శ్రీ విద్యని కలిసి తమకు బీ ఎల్‌ వో విధుల నుంచి పూర్తిగా మినహాయింపు నివ్వాలని వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా సంఘ బాద్యులు మాట్లాడుతూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా పబ్లిక్‌ యుటిలిటీస్‌ వాటర్‌ ,లైట్స్‌, పవర్‌ మరియు ఇతరములకు సంబంధించి విధులు చేసే వారికి బిఎల్‌ఓ విధులు అప్పగించకూడదని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఒక పక్క తమ విధులు నిర్వహించుకుంటూ బీ ఎల్‌ వో విధులు నిర్వహించడం ఇబ్బందిగా పరిణమించిన నేపథ్యంలో తమను బి ఎల్‌ వో లుగా తొలగించి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసారు. జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఆలీ మరియు ఇతర వార్డ్‌ ఎమినిటీస్‌ సెక్రటరీలు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.