Jul 08,2023 21:54

శిల ఫలకాన్ని ప్రారంభిస్తున్న ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ

      హిందూపురం : పట్టణంలో బహువిధ పశు వైద్యశాల ఆవరణంలో నిర్మాణం చేసిన నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను వర్చువల్‌ విధానం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ శిల ఫలకాన్ని ఆవిష్కరించి, భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా అసుపత్రిలోని ప్రయోగశాలలో పశువుల వ్యాధులు నిర్ధారించేందుకు చేస్తున్న పరీక్షలు, ప్రయోగశాలలో ఉన్న పరికరాలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖధికారి డాక్టర్‌ ఎన్‌.శుభదాసు, హిందూపురం డివిజన్‌ ఉపసంచాలకులు డాక్టర్‌ పి.పెంచలయ్య, బహువిధ పశు వైద్య శాల ఉపసంచాలకులు డాక్టర్‌ పి.గిరిజా, అనంతపురం ప్రధాన ప్రయోగశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.రామచంద్ర, సహాయ సంచాలకులు డాక్టర్‌ పిబి.తిప్పేస్వామి, డివిజనల్‌ పశువైద్యుడు డాక్టర్‌ ఆర్‌.శివ శంకర్‌ నాయక్‌, వైద్యులు డాక్టర్‌ టి.రాజన్న పాల్గొన్నారు.