ప్రజాశక్తి - ఆదోని
ప్రస్తుత పరిస్థితుల్లో బహుజన సమాజాన్ని చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత ఉందని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.మాదన్న, జిల్లా గౌరవాధ్యక్షులు రామశేషయ్య తెలిపారు. శనివారం ఆదోనిలోని కార్యాలయం ముందు బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. జిల్లా అధ్యక్షులు భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యాభివృద్ధికి పాటు పడాలని కోరారు. రిజర్వేషన్ తొలగింపు చర్యలను తిప్పి కొట్టాలని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా బాధ్యులు లక్ష్మన్న, రాము, ఉపాధ్యాయులు అమల్‌నాథ్, చిరంజీవి, జనార్ధన్, రామన్న, వేణుగోపాల్, గోపాల్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న భాస్కర్










