Oct 01,2023 00:43

పి.అప్పనర్స

ప్రజాశక్తి అరకులోయ రూరల్‌:వైసిపి ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణకు కమ్యూనిస్టుల్ని విమర్శించే నైతిక హక్కు లేదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పనర్స అన్నారు. శనివారం అరకువేలి ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో మండల కార్యదర్శి కె.రామారావు, జిల్లా కార్యదర్శి సభ్యులు వి.ఉమామహేశ్వరరావుతో కలిసి స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకే అక్టోబర్‌ ఐదున జరిగే భారీ బహిరంగ సభ గోడ పత్రికను విడుదల చేశారు.ఈ సంధర్భంగా అప్పనర్స మాట్లాడుతూ, రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపికి అమ్ముడుపోయిన జగన్‌ ప్రభుత్వం కమ్యూనిస్టులను విమర్శించడం దిగజారుడుతనమన్నారు. దళితులకు, మైనార్టీలు, గిరిజనులు, రైతులకు వ్యతిరేక చట్టాలు పార్లమెంట్లో బిజెపి ప్రవేశపెడుతుంటే వైసిపి చేతులెత్తి మద్దతు తెలిపిందని, మరీ బిజెపికి ఎంతకు అమ్ముడుపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నించడం సిపిఎం రాజకీయ విధానమని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ను కారు చౌకగా ప్రైవేట్‌ వ్యక్తులకి కట్టబెడుతుంటే జగన్‌ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.రాష్ట్రాన్ని దివాలా తీసేందుకు బిజెపి అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించకుండా వైసిపి ప్రభుత్వం లొంగుబాటు దోరణి వ్యవహరిస్తుందన్నారు. ప్రజల కోసం ప్రాణాలను కమ్యూనిస్టులు త్యాగం చేశారని, అటువంటి చరిత్ర కలిగిన తమను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని భవిష్యత్తులో జగన్‌ని అధికారం నుండి దించి ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఐదో తేదీన జరిగే స్టీల్‌ ప్లాంట్‌ బైక్‌ యాత్ర ముగింపు సందర్భంగా కూర్మన్న పాలెంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు జగన్నాథం, జె.భగత్‌రామ్‌ పాల్గొన్నారు.
బహిరంగ సభను జయప్రదం చేయండి.
హుకుంపేట:విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వేతిరేకంగా 5న కూర్మనపాలెం జంక్షన్‌లో సీపీఎం ే బహిరంగ సభను జయప్రదం చేయాలని హుకుంపేట మండల కమిటీ అధ్వర్యంలో బహిరంగ సభ గోడ పత్రికలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వి.లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉక్కు పరిరక్షణ బైక్‌ యాత్ర సిపిఎం నిర్వహించిందన్నారు.స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపకపోతే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వానికి ఘోరీ కడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకురాలు హైమావతి, సోమన్న, కృష్ణారావు, అప్పలకొండ పడాల్‌, ఆనంద్‌, ప్రసాద్‌,తదితరులు పాల్గొన్నారు.