Aug 22,2023 19:47

వినోద్‌ కుమార్‌ దంపతులను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలో గత పదేళ్లుగా ఎంఇఒగా పని చేస్తూ ఇటీవల బదిలీపై కర్నూలుకు వెళ్లిన కె.వినోద్‌ కుమార్‌కు మండల ఉపాధ్యాలందరూ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు, సన్మానం నిర్వహించారు. మంగళవారం గోనెగండ్లలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండల సన్మాన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపిడిఒ నాగేష్‌, మండల విద్యాశాఖ అధికారులు రామాంజనేయులు, నీలకంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినోద్‌ కుమార్‌ మండలంలో దశాబ్ద కాలం పాటు పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అనంతరం మండలం ఉపాధ్యాయులందరూ వినోద్‌ కుమార్‌ దంపతులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అలాగే నూతన ఎంఇఒలకు స్వాగతం పలికారు. చంద్రపాల్‌, నరసింహులు, బతుకన్న, రహంతుల్లా, వి.రాముడు, వెంకటేశ్వర్లు, మన్సూర్‌, ఎల్లప్ప, నాగేశ్వరావు, కెసి.నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.