ప్రజాశక్తి -అరకులోయ రూరల్:విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై సిపిఎం చేపట్టిన బైక్ యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బుదవారం అరకులోయ ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో బైక్ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు.స్టీల్ ప్లాంట్ ను బడా పెట్టుబడిదారు కంపెనీకి కట్టబెట్టాలని కేంద్ర ప్రయత్నం చేస్తోందని, దీనిపై కార్మికులు, ప్రజలు గత వెయ్యి రోజుల నుంచి పోరాడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు.స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలన్నారు. బైక్ యాత్ర 25న అరకులోయకు చేరుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, మండల నాయకులు కె.మగ్గన్న, జి బుజ్జిబాబు, టి.జోషి, సిహెచ్ .గురుమూర్తి పాల్గొన్నారు.
సంతలో కరపత్రాల పంపిణీ ...
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని ఈ నెల 25, 26,తేదీల్లో జరగనున్న ఉక్కు రక్షణ బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన వారపు సంతలో సిపిఎం శ్రేణులు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఎం చింతపల్లి మండల కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి మాట్లాడుతూ, విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు.వెయ్యి రోజులకు పైగా పోరాడుతున్నా. కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదన్నారు. 29న కూర్మన్నపాలెం స్టీల్ దీక్ష శిబిరం వద్ద వేలాది మందితో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మజ్జి రాంబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.










