Sep 05,2023 22:18

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆర్‌డిఒ మధుసూదన్‌, అధికారులు

          అనంతపురం : బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్‌డిఒ మధుసూదన్‌ పిలుపునిచ్చారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ పీడీ బి.ఎన్‌.శ్రీదేవి అధ్యక్షతన బాల్యవివాహాల నిషేధ చట్టం-2006కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామస్థాయిలో విఆర్‌ఒ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. వీరందరూ గ్రామాల్లో ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే కలిగే అనార్థాల గురించి వివరించాలన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ శ్రీదేవి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బాల్య వివాహ నిలుపుదల, కొత్త జీవో ఎంఎస్‌ 31 గురించి కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్‌ రామలక్ష్మి, డిసిపిఒ సుబ్రమణ్యం, అనంతపురం అర్బన్‌ సిడిపిఒ లలితమ్మ, ఛైల్డ్‌ లైన్‌ కోఆర్డినేటర్‌ కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు.