ఫొటో : పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఆర్‌డిఒ మధులత
బాల్య వివాహాలను నివారించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : బాల్యవివాహాలు నిర్మూలించడం అందరి బాధ్యత అని, ఆత్మకూరు ఆర్‌డిఒ కె.మధులత పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పురపాలక సమావేశ మందిరంలో బాల్యవివాహాల నిర్మూలనపై తహశీల్దారులు, ఎంపిడిఒలు, ఐసిడిఎస్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అమలులోకి వచ్చిందని తెలిపారు. ఐసిడిఎస్ అధికారులు బాల్య వివాహాలను అరికట్టే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఐసిడిఎస్ పిడి హేనసుజనా మాట్లాడుతూ ఆడబిడ్డల అభివృద్ధికి బాల్యవివాహాలు ముప్పు కలిగిస్తాయని ఆమె తెలిపారు. వాటి నివారణకు కృషి చేయాలని తెలిపారు. బాలిక శిశువుల సంరక్షణ అధికారి సురేష్, ఐసిడిఎస్ అధికారులు, ఎంపిడిఒలు, పోలీసులు పాల్గొన్నారు.










