Nov 16,2023 21:50

ప్రజాశక్తి- గుడిపల్లి: మండలంలోని బాలుర వసతి గృహాన్ని గురువారం పట్టుభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడి వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సర్పంచ్‌ నారాయణ, టిడిపి నాయకులు లక్ష్మీపతి, శీను, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.