Sep 25,2023 22:16

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
            బాలల సంరక్షణ అందరి బాధ్యతని నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ డి.రజిత చెప్పారు. నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో ఏలూరు అశోక్‌ నగర్‌లోని రాజీవ్‌ గాంధీ పార్కులో డ్వాక్రా మహిళలకు బాలల పరిరక్షణపై అవగాహనా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా రజిత మాట్లాడుతూ బాలలకు రక్షణగా ఉందామన్నారు. బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సంరక్షకులకు కూడా శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కో-ఆర్డినేటర్‌, బి.నేహీమియ, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ జి.రాజేశ్వరి, రిసోర్స్‌పర్సన్‌ చాప్లిన్‌, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.