Aug 19,2023 23:15

జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక
ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) :
బాలల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా పటిష్ట మైన చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ చైర్మన్‌ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు. 'జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ' ఆదేశానుసారం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో, శనివారం జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ చైర్మన్‌ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మాట్లాడుతూ జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ' వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బాలలు నేరాలు చేయకుండా ఏవిధంగా అరికట్టాలి, పునరావాసం మరియు ప్రత్యామ్నాయాలు నిర్బందానికి పునరావాసం, పునరుద్ధరణ పద్దతులు, పిల్లల స్నేహపూర్వక విధానాలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదరి కె ఎం. రామకష్ణయ్య , జువినైల్‌ జస్టిస్‌ బోర్డు' ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌. రాజశేఖర్‌, అడిషనల్‌ డి సి పి వెంకటరత్నం ,పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.