బాధ్యతలు స్వీకరిస్తున్న డిఇఒ మీనాక్షి
కొత్తచెరువు : శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జి డిఇఒగా మీనాక్షి గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారు రామగిరి మండలంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మీనాక్షి గాయపడడంతో చికిత్స నిమ్తిం ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యుల సలహాల మేరకు విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్య కుదుట పడడంతో గురువారం నాడు ఆమె తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పెనుగొండ డిప్యూటీ డిఇఒ రంగస్వామి ఇన్‌ఛార్జి డిఇఒగా కొనసాగారు. ఆయన నుంచి మీనాక్షి బాధ్యలు చేపట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పర్యటించి పాఠశాలలు అభివద్ధికి చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు.










