డిఎంఅండ్‌హెచ్‌ఒ ఇబి.దేవి
అనంతపురం కలెక్టరేట్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఇబి.దేవి విధుల్లో చేరారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఒగా పనిచేస్తున్న డాక్టర్ ఇబి.దేవి ఉద్యోగోన్నతిపై అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వచ్చారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్ యుగంధర్, కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, చెన్నకేశవులు, నారాయణస్వామి, అనుపమ జేమ్స్, మహేంద్ర నాథ్, ఎస్‌ఒ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










