Aug 18,2023 19:25

బాధితులను పరామర్శిస్తున్నరంగయ్య

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను మాలమహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య శుక్రవారం పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టిఎస్‌.కుల్లూరు మాల మల్లకల్లును, అలాగే పార్లపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో గాయపడిన అత్త, కోడలును పరామర్శించారు. వారికి వైద్యం చేయించారు. అలాగే ధైర్యం చెప్పి చిన్న, చిన్న విషయాలకు సహనం కోల్పోవద్దని తెలిపారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మల్లేష్‌, పరమేష్‌, నరసింహా, లక్ష్మణ్‌, పెద్దయ్య, రాజోలప్ప, నాగప్ప పాల్గొన్నారు.