May 02,2023 22:40

matladutunna nageswararao

బాధిత రైతులను ఆదుకోవాలి : రైతుసంఘం
ప్రజాశక్తి-బంటుమిల్లి,కృత్తివెన్ను
ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు ,పెనమలూరు, కంకిపాడు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, గన్నవరం, కోడూరు తదితర మండలాల్లో మొక్కజొన్న, జొన్న,పసుపు, వరి పంటలు నీటి మునిగి, నేలకొరిగి ఆయా ప్రాంతాల్లో భారీగ దెబ్బతిన్నాయని ఎపి రైతుసంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. బంటుమిల్లిలోని సంఘ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టం అంచనాలను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం సేకరించి బాధిత రైతులకు తక్షణమే పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందనీ, బాధిత రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బోస్‌ బొమ్మ సెంటర్‌ సమీపంలో ఉన్న పసుపు వర్తక సంఘం భవన్‌లో పసుపు రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి లంకదాసుల అజరు ఘోష్‌సీనియర్‌ నాయకులు సుజ్ఞానం జనార్థనరావు, సమ్మెట నాంచారయ్య, కంఠంనేని మురళి, డొక్కు నాగేశ్వరావు తదితర రైతులు పాల్గొన్నారు.