ప్రజాశక్తి - మంత్రాలయం
మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, టిడిపితోనే మహిళలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు శివబాల తెలిపారు. శనివారం తిక్కారెడ్డి అధ్వర్యంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు నరవ శశిరేఖ అధ్యక్షతన 'మహాశక్తి' వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా శ్రీమఠం చేరుకొని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మహిళల కోసం ప్రకటించిన పథకాలను ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ శ్రీనిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు తెలిపారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పారు. 'తల్లికి వందనం' కింద ఇంట్లో ఎంత మంది చదివితే అంతమందికి తల్లి ఖాతాలో ఒక్కొక్కరికి రూ.15 వేలు వేస్తారని తెలిపారు. ప్రతి మహిళకూ బస్సు ఉచిత ప్రయాణం కల్పిస్తారని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ చట్టం, పదవుల్లో సముచిత స్థానం టిడిపితోనే సాధ్యమని తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, పెద్దకడబూరు మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, తెలుగు మహిళ, మహాశక్తి ప్రోగ్రామ్ టీమ్ నాడిగేని నరసమ్మ, రూతమ్మ, సరోజమ్మ, శంకుతలమ్మ, వట్టెప్పగారి నరసింహులు, మేకల నరసింహులు, తిక్కస్వామి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, నాడిగేని మహదేవ్, ముని, హనుమంతు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి యోబు, బొగ్గుల నరసన్న, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, లక్ష్మారి చిదానంద పాల్గొన్నారు.










