Sep 22,2023 19:36

దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టిడిపి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బీవీ నాయకత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరాయి. 10వ రోజు రిలే నిరాహార దీక్షలను ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములుతో కలిసి నిర్వహిస్తూ 'మేము సైతం - బాబు కోసం' అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ పేరుతో యువతకు నైపుణ్యాలు నేర్పిస్తే, స్కీం పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. సిఐడిని అడ్డు పెట్టుకొని వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి తెలుగు వాడు చంద్రబాబు పక్షాన నిలబడ్డాడని తెలిపారు. నాయకులు దయాసాగర్‌, రాందాస్‌ గౌడ్‌, రంగస్వామి గౌడ్‌, మధుబాబు, సుందర్‌ రాజు, తురేగల్‌ నజీర్‌ అహ్మద్‌, కలీముల్లా, కటారి రాజేంద్ర, మాబు సాహెబ్‌ పాల్గొన్నారు.