ప్రజాశక్తి - సీతంపేట : పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, పరిశీలకులు కలమటి సాగర్ ఆధ్వర్యంలో సీతంపేటలో చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. జగన్ ఫ్యాక్షనిస్టు రూపాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. పోలీసుల అండతో అరాచకాలు సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం వెంటనే దృష్టి సారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, ఎస్‌టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, పాలక రాజాబాబు, మహాశక్తి ప్రచార కర్త తోయిక సంధ్యారాణి, ఐటిడిపి కో-ఆర్డినేటర్ హిమరక పవన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిపాడులో
మండలంలో టిడిపి నాయకులు పడాల భూదేవి మర్రిపాడు పంచాయతీ మూలగూడలో బాబుతో నేనుసైతం కార్యక్రమం నిర్వహించి వైసిపి దుష్టపాలన, దౌర్జన్యాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. గ్రామంలో వరద గోడ, మంచినీరు, రహదారి సౌకర్యం లేదని భూదేవి ఎదుట వాపోయారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సవర కుంపి, నాయకులు సవర మంగయ్య, సవర మల్లేష్, సవర చిన్నారావు, మర్రిపాడు వైస్ ప్రెసిడెంట్ సవర జమ్మయ్య, ఓబియో, మార్కో, సిమియో, ఎల్లంగో, తదితరులు పాల్గొన్నారు.
నేడు కురుపాంలో నిరసన దీక్ష
గుమ్మలక్ష్మీపురం :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దీక్షకు మద్దతుగా నేడు కురుపాం మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపడుతున్నట్లు కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు శత్రుచర్ల విజయరామరాజు హాజరవుతున్నట్లు తెలిపారు. ఐదు మండలాల్లోని అధ్యక్ష కార్యదర్శులు, యూనిట్ ఇన్‌ఛార్జీలు, బూత్ ఇన్‌ఛార్జీలు, గ్రామ కమిటీ సభ్యులు, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలపాలని ఆమె కోరారు.
టిడిపిలోకి 30 కుటుంబాలు
మండలంలో ఇటీవల కాలంలో పలు కుటుంబాలు టిడిపిలో చేరుతున్నాయి. మొన్న కప్పకల్లులో 50 కుటుంబాలు టిడిపిలో చేరగా ఆదివారం చెముడుగూడలో మరో 30 కుటుంబాలు టిడిపి తీర్ధం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో టిడిపికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్లు మధ్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు పాడి సుదర్శన్ రావు, పోలూరి శ్రీనివాసరావు, నాయకుల చిరు, మల్లి,రామారావు ఉన్నారు.
కేసలిలో రిలే నిరాహార దీక్ష
పాచిపెంట : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మండలంలోని కేసలిలో మండల టిడిపి అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరోసభ్యులు గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 కుటుంబాలు జన్ని కొండలరావు ఆధ్వర్యంలో టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సంధ్యారాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ముఖీ సూర్యనారాయణ, గూడెపు యుగంధర్, చల్ల కనకారావు, కె.పోలినాయుడు. దండి మోహన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాచిపెంట : అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి అధ్యక్షులు గండి రామినాయుడు ఆధ్వర్యంలో రాజుపేట, అర్తాలి, ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో గొర్లె రాంబాబు మాజీ సర్పంచ్ బొమ్మలాట శంకరరావు, యందవ సత్యం నాయుడు, కోడి శ్రీహరి మజ్జి శ్రీను నాశ గణపతి బొమ్మాలి సురేష్, కిమిడి బంగారునాయుడు, జీలకర్ర మోహన్, తాడేలా గణేశ్వరరావు, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










