Sep 19,2023 19:44

పోస్టు పంపుతున్న గురురాజ్‌ దేశాయి

ప్రజాశక్తి - నందవరం
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 'మేము సైతం' టిడిపి నాయకులు అండగా నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌కు 116 ఉత్తరాలు పంపించారు. ముందుగా టిడిపి మండల యువ నాయకులు గురురాజ దేశాయి ఆధ్వర్యంలో నందవరంలో వెలసిన వినాయక విగ్రహాలను సందర్శించారు. రాష్ట్రానికి జగన్‌ అనే విఘ్నం నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుకుంటూ, చంద్రబాబుకు మద్దతుగా 'మేము సైతం - బాబు కోసం' అని నినదించారు. మాజీ సర్పంచి రామన్న గౌడ్‌, దేశాయి యూత్‌ అధ్యక్షులు సాధిక్‌, కె.శివ, డానియేల్‌, జయన్న, నాగేంద్రప్ప, నర్సప్ప, దేశాయి యూత్‌ సందీప్‌, కాసీం పాల్గొన్నారు.