Sep 25,2023 21:24

ఆదోనిలో మెడకు ఉరితాడుతో నిరసన తెలుపుతున్న ఉమాపతి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
చంద్రబాబు నాయుడును జైలు నుంచి విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు హెచ్చరించారు. టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద మెడకు ఉరితాడు బిగించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా టిడిపి నాయకులు చేపట్టిన దీక్ష 13వ రోజూ సాగింది. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబును తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నాడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ పొందిన నేడు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తుండడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఆదోని యాదవ సంఘం నాయకులు నాగరాజ్‌, వీరేష్‌, హనుమేష్‌, ముని, బసవరాజు, పెద్ద నరసింహులు, గోవర్ధన్‌, అర్జున, ఉరుకుందప్ప, ఇంద్రనగర్‌ బాబులు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. టిడిపి జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి, మారుతి నాయుడు, రంగస్వామి నాయుడు, సాకరి మారుతి రావు, రామస్వామి, శ్రీనివాసచారి, తిమ్మప్ప, జెబి.రంగన్న, వీరేష్‌, ప్రతాప్‌ రెడ్డి, బుద్ధారెడ్డి, శివప్ప, షాదుల్లా, అల్తాఫ్‌, రంగన్న, గోపాల్‌, జగదీష్‌, మల్లికార్జున, రంగన్న, గోవిందప్ప, శంకర్‌, బసవరాజు, సున్నంభట్టి లక్ష్మన్న, మాబాష, వల్లమన్న, కృష్ణారెడ్డి, సాయిబాబు, శ్రీనివాస్‌ ఆచారి, బసవ, వీరేష్‌, దుబ్బరాజు, చాగి మల్లికార్జున్‌రెడ్డి, శివప్ప ఉన్నారు.