ప్రజాశక్తి - మంత్రాలయం
మచ్చ లేని నాయకులు చంద్రబాబు కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం రాఘవేంద్ర సర్కిల్‌లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 14వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటికొస్తారని తెలిపారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, రాఘవేంద్ర సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేస్తూ సంఘీభావం తెలిపారు. మాధవరం కృష్ణమోహన్ రెడ్డి, చిలకలడోన హనుమంతు, సూగూరు భాస్కర్ రెడ్డి, చెట్నపల్లి లక్ష్మయ్య, రవి, నరసింహులు, వీరేష్, హనుమంతు, భీమన్న, లక్ష్మారి నరసింహులు, రామయ్య, ఉసేని, హనుమంతు, బంగారయ్య, నాగేంద్ర, రామాంజినేయులు, బొజ్జప్ప, రమేష్, ఉరుకుందు, ధర్మరాజు, వీరేష్, అయ్యన్న, వగరూరు పవన్ కూమర్ రెడ్డి, కేశన్న, ఏసన్న, మహదేవ్, రాఘప్ప, హిదాయత్, సాధిక్, రియాజ్, రమేష్, ఏలియా, చిన్న, దస్తగిరి, మాధవరం భీమేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు సాయి కుమార్ రెడ్డి, ఉమాకాంత్ రెడ్డి, నర్సరెడ్డి, పద్మరాజు, రాజశేఖర్ రెడ్డి, సూగూరు సుజ్ఞానం, ఇశ్రాయేలు, రవి, నాగరాజు, వీరేష్‌కు నియోజకవర్గ పరిశీలకులు శివబాల నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నాయకులు అశోక్ రెడ్డి, విజయ రామిరెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు మారెప్ప, ఏబు, శివ, వగరూరు అబ్దుల్, బెళగల్ ప్రభాకర్ రెడ్డి, ఉసేని, తిరుమలేష్, రాజు, ఐ టిడిపి సల్మాన్ రాజు, నీలకంఠ, చిదానంద, కృష్ణ, నాగేష్, లింగప్ప మద్దతు తెలిపారు.
కర్ణాటకలోని మాన్విలో నిరసనలు
టిటిడి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్ణాటక రాష్ట్రం మాన్విలో జరిగిన నిరసనకు తిక్కారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రతి పక్ష పార్టీలైన జెడిఎస్ నాయకులు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుపై మాట్లాడారు. నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేయడం సాక్ష్యాధారాలు లేకుండా జైలులో ఉంచడం బాధాకరమన్నారు. ఈ విషయంలో గవర్నర్ కలుగజేసుకోవాలని కోరారు. టిడిపి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ, మాన్వి ఎమ్మెల్యే అంపయ్య నాయక్, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ పాల్గొన్నారు. ఆలూరులో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి రెడ్డి సంఘం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, ఆస్పరి మండల కన్వీనర్ పరమా రెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి సులోచన రెడ్డి, టిడిపి యువ నాయకులు రఘు ప్రసాద్ రెడ్డి, పచ్చరపల్లి పాటిల్ ప్రహ్లాద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మురళీ రెడ్డి, రఘు రామిరెడ్డి, హరి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తిమ్మాపురం నాగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పులకేసి రెడ్డి, దేవి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నర్సారెడ్డి, వెంకట రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆలూరు కోర్టు ముందు టిడిపి న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయవాదులకు టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ వైకుంఠం మల్లికార్జున చౌదరి, సీనియర్ నాయకులు దేవేంద్రప్ప పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. ఆలూరు న్యాయవాదులు వాయుజీవోత్తమరావు, వలీ, ప్రవీణ్ కుమార్, విజరు భాస్కర్, వీరేష్, రంగప్ప, రవి, టిడిపి నాయకులు, మాజీ ఎంపిపి భీమలింగప్ప చౌదరి, కటారికొండ శ్రీనివాసులు, వెంకటరామప్ప, మాఘం ఉమాపతి, గుర్రం అనిల్, గడ్డం నాగరాజు, అరికేర మల్లేష్, మల్లప్ప పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన దీక్షలు 13వ రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు దయాసాగర్, రాందాస్ గౌడ్, రంగస్వామి గౌడ్, మధుబాబు, తురేగల్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
మంత్రాలయంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి










