ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి అధినేత చంద్రబాబు బయటికొచ్చే వరకు తమ పోరాటం ఆగదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 'మేము సైతం' అంటూ ముస్లిం, మైనారిటీలు పదో రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించి సంబరాలు చేసుకుంటున్న వైసిపి నాయకులకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీక్షలకు మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిబాబా, జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, వగరూరు అబ్దుల్ సాబ్, కోసిగి ఖలందర్ సాబ్, గౌస్, ఉసేన్ సాబ్, బెళగల్ ఉసేనితో పాటు దాదాపు 100 మంది సంఘీభావం తెలిపారు. సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, ధని, తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, బీసీ సెల్ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమేష్ గౌడ్, విజయ రామిరెడ్డి, చిన్నతుంబళం వీరేష్ గౌడ్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ వట్టేప్ప గారి నరసింహ, మేకల నరసింహులు, గవిగట్టు ఈరయ్య, చిన్నభూంపల్లి మాజీ సర్పంచి నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచి కృష్ణారెడ్డి, చిన్న ఈరయ్య, ప్రభాకర్ రెడ్డి, గుండేష్, వగరూరు పవన్ కూమర్ రెడ్డి, గోపాల్, కంబాలదిన్నె శీను, ఎస్సీ సెల్ నాయకులు మారెప్ప, ఏబు పాల్గొన్నారు.
దీక్షల్లో మాట్లాడుతున్న టిడిపి నాయకులు గోపాల్ రెడ్డి










