Oct 12,2023 21:16

ఇంటింటి ప్రచారం చేస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  బాబుతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్‌.కలిగొట్టు, జె.కలిగొట్టు, కొసగూడ, డోకులగూడ గ్రామాల్లో కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శిపోలూరు శ్రీనివాసరావు, యూనిట్‌ ఇంచార్జ్‌ చిన్న జయంత్‌, చిన్నారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని సోమగండిలో బాబుతో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబునాయుడును అన్యాయంగా అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ కు తరలించిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు సవరతోట మొఖలింగం, సవర సోడంగి, వార్డు సభ్యులు జి.శ్రీరాములు, గొర్ల రాదయ్య, నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు.
అంకవరంలో....
జియ్యమ్మవలస మండలం అంకవరంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, టిడిపి అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, అరుకు పార్లమెంటు కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు మూడడ్ల సత్యంనాయుడు, ఎస్టీ సెల్‌ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, కురుపాం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి నాయుడు, క్లస్టర్‌ 6 జోగి బుజింగరావు, మండల కో ఆర్డినేటర్‌ గుబ్బరు నరేశ్‌ ,ఎక్స్‌ సర్పంచ్‌ కరణం అప్పలనాయుడు, ఎంపిటిసి రాయిపిళ్లి భారతి, మాజీ సర్పంచ్‌ పప్పల సత్యంనాయుడు పాల్గొన్నారు.
సాలూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జరిగిందని నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి సంధ్యారాణి అన్నారు. పట్టణ నాయకులు, కార్యకర్తలతో కలిసి బంగారమ్మకాలనీలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్‌ డబ్బి కష్ణ పాల్గొన్నారు.