ప్రజాశక్తి - ఆదోని
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు విమర్శించారు. బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఆదోనిలోని ఎన్‌టిఆర్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ శిబిరాన్ని మీనాక్షి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం పిరికి పంద చర్య అని విమర్శించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి సైకో ఆనందం పొందడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ఇంకో ఆరు నెలల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో వచ్చిన వెంటనే ఎవరినీ వదలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బేషరతుగా బాబును విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టిడిపి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, నాయకులు రంగస్వామి నాయుడు, రామస్వామి, బుద్ధారెడ్డి, వాల్మీకి వెంకటేష్, కృష్ణారెడ్డి, మారుతి నాయుడు, రామాంజనేయులు, వీరేష్ కుమారి, సాధిక బేగం, శ్రీదేవి, ఫక్రుద్దీన్, శివప్ప, వెంకటేష్ చౌదరి, బాలాజీ, చాంద్, బాష, శాంతి, మల్లి, మల్లికార్జున ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్ష
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి సీనియర్ నాయకులు సూరం భాస్కర్ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు బేషరతుగా బయటకు వస్తారని, ఆయన నిజాయితీపరుడని కొనియాడారు. నాయకులు ఫక్రుద్దీన్, షేక్షావలీ, సోమశేఖర్ రెడ్డి, మల్లేశప్ప ఉన్నారు.
దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న మీనాక్షి నాయుడు










