ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : చిన్నారులకు పోలీసు ఉద్యోగ విధులు అత్యవసర పరిస్థితులలో వారు వినియోగించే కమ్యూనికేషన్ విధానంపై అవగాహన కల్పించాలని ఏలూరు రెండో పట్టణ ఎస్ఐ శుభ శేఖర్ తెలియజేశారు. ఏలూరు నగరంలోని రెండో పట్టణ పరిధిలో ఉన్న సిద్ధార్థ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసు విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సుభా శేఖర్ మాట్లాడుతూ అత్యవసర సమయాలలో పోలీసులు ఇంత చాగచక్యంగా వ్యవహరిస్తారని వారు చేసే విధులు పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని అందుకే చిన్నారులకు పోలీసులపై అవగాహన కల్పించామని తెలిపారు. తమ వినియోగించే కమ్యూనికేషన్ విధానంపై కూడా వారికి అవగాహన కల్పించామని తెలిపారు. కమ్యూనికేషన్ విధానంలో పోలీసులు ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకుంటారు అనే అంశంపై చిన్నారులతో కూడా మాట్లాడించి వారికి అవగాహన కల్పించమని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










