ప్రజాశక్తి-ఆదోని : వాంతులు, విరేచనాల అయినవారు తగు జాగ్రత్తలు పాటించుకోకుంటే ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని చిన్నపిల్లల ప్రముఖ వైద్యుడు గోపీనాథ్ సూచించారు శుక్రవారం ఆదోని పట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్ లో ఓరల్ రిహైడ్రేషన్ తెరిపి పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు వాంతులు విరోచనాలు అయిన సమయంలో ఓఆర్ఎస్ ద్రావణం చిన్న పిల్లలకు, పెద్దలకు తాపించడం వల్ల కొంతఉపశమనం కలుగుతుందన్నారు. అలాంటి సమయంలో ఓఆర్ఎస్ ఏ మోతాదులో ఇవ్వాలనే అంశంపై డాక్టర్లు రఘునాథ్, సూర్దాసు, హరీష్, గోపీనాథ్, ఆదిత్య, శ్రీనివాసులు అవగాహన కల్పించారు. అదేవిధంగా శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్తంగా ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఓఆర్ఎస్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎండా వేడిమికి, కలుషిత ఆహారం, నీరు తీసుకున్న సమయంలో వాంతులు, విరేచనాల బారిన పడి ఓరల్ రీహైడ్రేషన్ ఏర్పడుతుందన్నారు. ఆ సమయంలో థెరపీ చేసి కోలుకోవచ్చన్నారు. డాక్టర్లను సంప్రదించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు










