Oct 01,2023 11:50
  • జి జి హెచ్ లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు
  • జిల్లాలో నిఫా వైరస్ ప్రభావం నిల్
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామ గిడ్డయ్య

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతుంది. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కేసులు నమోదవుతున్నాయి కరోనా వైరస్ కంటే నిఫా వైరస్ ప్రమాదకరమైనది కాదు. నిఫా వైరస్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్యతో ముఖాముఖి.... .

 

  • ప్రజా... నిషా వైరస్ అంటే ఏంటి..? ఎలా సోకుతుంది. లక్షణాలు, చికిత్స ఏమిటి 

డా. గబ్బిలాలు, పందుల నుంచి మనిషికి వ్యాపించేదే  నిపా వైరస్. కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన కొవిడ్ తరహాలోనే ఇదీ ఉంటుంది. తొలుత జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత.. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. నిఫా వైరస్కు ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడం, వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేకపోవడం ఆందోళనకర విషయం.
లక్షణాలు... నిషా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు. లేదా ప్రాణాంతకంగా కూడా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) చెబుతోంది. ఉపిరితిత్తుల్లో స్వల్పంగా సమస్యల నుంచి ప్రమాదకరమైన ఎన్సిఫిలైటిస్ వరకు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ వ్యాధి ముదిరితే మాత్రం.. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగిన 24 గంటలు నుంచి 48 గంటల్లో సంబంధిత మనిషి కోమాలోకి జారుకునే ప్రమాదం కూడా ఉందని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది. నిషా వైరస్ సోకిన 14 రోజులు - 45 రోజుల మధ్యలో వ్యాధి నయమవుతుంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారిలో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. కానీ 20శాతం మందిలో నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని డబ్ల్యూహెచ్ తెలిపింది. ప్రస్తుతానికి నిఫా వైరస్కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఐసీయూలో పెట్టి చికిత్స మాత్రమే అందిస్తారు. అయితే ఈ వైరస్ తీవ్రత తగ్గించేందుకు మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులను వాడుతారు. 

  • నిఫా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. గాట్లు పెట్టినట్లున్న పచ్చి పండ్లను తినకూడదు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి, బయటి మాంస పదార్థాలకు దూరంగా వుండాలి. వ్యాధి లక్షణాలు కనిపించినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

  • ప్రజా.. ఫ్యామిలీ ఫిజీషియన్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు ఎలా పనిచేస్తున్నాయి

డా... ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాలమురళి పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణలో షెడ్యూల్ రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పథకం కింద ప్రజలకు 105 రకాల మందులు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని 14 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. 40 వాహనాల ద్వారా ప్రతి పీహెచ్ఈసి పరిధిలోని విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ప్రజలకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు.

  • ప్రజా... ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎలా ఉంది

డా.. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఈనెల 30వ తేదీ నుంచి అమలు కానున్నది. ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది ఏఎన్ఎం వాలంటీర్లు  ఎంఎల్ హెచ్పి సి హెచ్ ఓ ల పరిధిలో సర్వే జరుగుతుంది ఈ నెల 30 నుంచి ఆరోగ్య శిబిరాలు మండలానికి మునిసిపాలిటీకి ఒక్కొక్కటి చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వ నియమాన నిబంధనల మేరకు కార్యక్రమాలు ఉంటాయి.. ఇందులో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు వైద్య చికిత్సలు అందిస్తారు. క్రిటికల్ గా వచ్చిన కేసులను ఆరోగ్యశ్రీ కింద ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు ప్రధానంగా ఈ టీంలో గైనకాలజిస్ట్ చిన్నపిల్లల వైద్యులు జనరల్ మెడిసిన్ వైద్యులు ఉంటారు