ప్రజాశక్తి-పత్తికొండ(కర్నూల్) : ప్రతి మానవుడు మానసిక ఒత్తిడి నుండి విముక్తి కలిగించడానికి ధ్యానం ఎంతో అవసరమని పత్తి కొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ పేర్కొన్నారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు ఆధ్వర్యంలో మహాత్మా యోగి నరసింహస్వామి పిరమిడ్ నిర్మాణం కోసం పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, పిరమిడ్ మాస్టర్ వెంకట్ రాముడు భూమి పూజ చేసి మాట్లాడారు. ధ్యానం చేయడం వల్ల జీవితంలో క్రమశిక్షణ పట్టుదల ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. జీవితంలో మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ధ్యానాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పిరమిడ్ మాస్టర్ వీరన్న శెట్టి, బన్నురు నారాయణ రాఘవరెడ్డి పెద్దయ్య ప్రసాద్ రెడ్డి వీరయ్య, పింజరి బాబు రంగన్న జులగల కృష్ణ శివ గ్రామ సర్పంచ్ నాగప్ప వైసీపీ నాయకులు శ్రీనివాసులు










