అవనిగడ్డ-కోడూరు రహదారి
అధ్వానంపై టిడిపి నిరసన
ప్రజాశక్తి-కోడూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చిన అవనిగడ్డ-కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం ఎప్పుడని టిడిపి నేతలు ప్రశ్నించారు. శనివారం అవనిగడ్డ-కోడూరు ప్రధాన రహదారి సమస్యపై శనివారం నిరసన తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కోడూరు రహదారి నిర్మాణంపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను అసత్య ప్రచారాలతో నమ్మబలికే ప్రయత్నం చేస్తుండటం బాధాకరమన్నారు. కేవలం నేడు రూ.50 లక్షలతో రోడ్డు మరమ్మతులు చేయిస్తున్న వైసిపి నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని కోరారు. మండల ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన హంసలదీవి సాగర తీరానికి కూడా కాలక్రమేణా పర్యాటకులు తగ్గుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు, టిడిపి నాయకులు బండే రాఘవ, కాగిత రామారావు, బడే భావన్నారాయణ, మద్దూరి కాంతారావు, గుడిసేవ సూర్యనారాయణ, బడే గాంధీ, పోతబోయిన శ్రీనివాసరావు, కొప్పనాతి సత్యనారాయణ, బొడ్డు వెంకన్న, మేడా శివాజీ, బడే పిచ్చయ్య, కూరాకుల ప్రసాద్, గుంటూరు గిరి, సాయి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










