ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల్లో మార్పును తీసుకు రావాడమే తన లక్ష్యమని దానికి అనుగుణంగా కమిషన్ పని చేస్తున్నదని రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ సిహెచ్ విజరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురం పట్టణం, రూరల్ మండలంతో పాటు లేపాక్షి, పరిగి మండలాల పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి అధికారి మార్పు తెచ్చుకుని ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి లబ్దిదారులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిటీ కమిషన్ మెంబర్ డిడి సురేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఆశ్వర్థనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డిడిలు శివనారాయణ, మాధవి, అశోక్ బాబు, లీగల్ మెట్రాలజీ మహమ్మద్ గౌస్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రామచంద్ర, తస్లీమ్‌తో పాటు స్థానిక సిఎస్‌డిటి హారతి, వన్‌టౌన్ సిఐ ఈరన్న, సిడిపిఒ రెడ్డమ్మతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
లేపాక్షి : మండలం కేంద్రంలోని కస్తూరి బా పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ చౌక ధాన్యపు కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజరు ప్రతాప్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కస్తూరి బా పాఠశాల లో సిబ్బంది స్థానికంగా ఉండటం లేదని, పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లను బయటకు తీసుకెళుతున్నారని ఫిర్యాదు అందడంతో ఆ విషయాలపై విచారణ చేశారు. సిబ్బంది పద్దతి మార్చు కోవాలని హెచ్చరించారు. అంగన్వాడీలో నెలకొన్న సమస్యపై ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మి కుమారితో మాట్లాడారు. కస్తూరి బా పాఠశాలలో పిల్లలకు తానే స్వయంగా పులిహోరాను వడ్డించారు. సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కాటం బాబు, ఎంఇఒ నాగరాజు నాయక్, సిడిపిఒ రెడ్డి రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పరిగి : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తద్వారా పౌష్టికాలు మెరుగ్గా ఉండే విద్యార్థుల్లో ఇటు విద్యాపరంగా ఆటు ఆరోగ్యపరంగాను మెరుగ్గా ఉంటారని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజరు ప్రతాప్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పరిగి మండలంలోని మోడా జడ్పీహెచ్‌ఎస్, ఏపీ ఆర్‌ఎస్ ఎక్స్లెన్స్ పాఠశాల, అంధుల పాఠశాల, బీసీ హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు ఎపిఆర్ ఎస్ పాఠశాలలో భోజన పంపిణీలో నాణ్యత పాటించడం లేదనిస్థానిక వైసిపి నాయకులతో పాటు కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంఇఒ లక్ష్మీదేవి పాల్గొన్నారు.










