ప్రతిభకనబరిచిన విద్యార్థులు
ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్ :ఈ నెల 29న తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూని వర్సిటీలో జరిగిన నేషనల్ యోగ పోటీల్లో అవెన్యూ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో అవెన్యూ స్కూల్ విద్యార్థులైన ప్రణీత శ్రీ విభవ్, కష్ణ నేషనల్ లెవల్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు యశ్వంత్, జివిఎల్ నిఖిల్, గౌతమ్, కమలేష్ ,తన్విక, సానహిత , మంజుష, దాత్రి, భవజ్ఞ, దియా వివిధ విభాగాల్లో నాలుగో స్థానాన్ని సంపాదించారు. పెనుబల్లి కష్ణ చైతన్య , ప్రిన్సిపాల్ మేడం నీరా ప్రసాద్ , వైస్ ప్రిన్సిపాల్ సురేష్ యోగ టీచర్ పద్మావతి విద్యార్థులు ప్రోత్సహించి ప్రోత్సాహకాలు అందించారు.










