Jul 08,2023 16:48

ప్రజాశక్తి-చల్లపల్లి : ఎన్నారై సోషల్ మీడియా పంచ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కృష్ణాజిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అనుబంధం రేపల్లె పాయింట్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఆ సంఘ మాజీ గౌరవ అధ్యక్షులు వెనిగళ్ళ వసంతరావు మాట్లాడుతూ దేశంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సహజం. కానీ పంచ్ ప్రభాకర్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా దళితులను అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. దళితుల మనోభావం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకు పంపాలని హెచ్చరించారు. ఇలాంటి దుర్మార్గమైన వెధవకు వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు రావుల దావీదు, నాయకులు చందోలు జయపాల్, పైడిపాముల వెంకన్న, బత్తుల బ్రహ్మం, గుంటూరు రాజు తదితరులు పాల్గొన్నారు.