ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2వ బెటాలియన్ లో 2023 ఆగష్టు 25 వ తేది నుండి దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఎవరైనా సమస్యల పై అప్పీల్ చేసుకుని, రిక్విజేసేన్ లెటర్ రాసి ఇచ్చిన పురుష, మహిళా అభ్యర్దులు కూడా సెప్టెంబర్ 21వ (గురువారం) తేదిన అప్పీలుకు హాజరు కాగలరని కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 25వ తేది నుండి ఇప్పటి వరకు దేహదారుడ్య పరీక్షలకు హాజరు కాని ఎస్సై అభ్యర్దులు సెప్టెంబర్ 20 వ తేదిన హాజరు కావచ్చన్నారు. సెప్టెంబర్ 4వ తేదిన వర్షం కారణంగా రాని పురుష అభ్యర్దలు, అప్పీలు చేసుకున్న పురుషులు, మహిళ అభ్యర్దులు కూడా సెప్టెంబర్ 21వ తేదిన హాజరు కావాలన్నారు. సెప్టెంబర్ 5వ తేది వర్షం కారణంగా రాని ఎస్సై అభ్యర్దులు సెప్టెంబర్ 22 తేది (ఇదే చివరి రోజు )న హాజరు కాగలరని డిఐజి తెలిపారు.










