ప్రజాశక్తి - బలిజిపేట : ప్రతి కుటుంబానికి అత్యుత్తమ వైద్యం అందించడానికి ప్రజలందరికీ ఇంటి వద్దే వైద్య పరీక్షలు, ఉచిత వైద్య సలహాలు, మందులు అందించి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ఉద్దేశ్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.జగన్నాధరావు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమంలో భాగంగా చిలకలపల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీటికి సంబంధించి వైద్య శిబిరాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు మాట్లాడుతూ సర్వేలో గుర్తించిన ఆరోగ్య వివరాలు జెఎఎస్ యాప్‌లో నమోదు చేయాలని, ఆరోగ్యశ్రీ యాప్‌పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేయించాలని సూచింఆరు. స్థానిక జెడ్ పిటిసి అలజంగి రవికుమార్, సర్పంచ్ అలజంగి సుందరరావు మాట్లాడుతూ అందరూ సమన్వయంతో కృషి చేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ డి.కిరణ్మయి, పంచాయతీ సెక్రటరీ ఎ.రామకష్ణ , ఆరోగ్య కార్యాలయ డెమో యోగీశ్వర రెడ్డి, సిహెచ్‌ఒ ఎస్ వి. రమణ,వైద్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
సాలూరు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడానికే జగనన్న ఆరోగ్య రక్ష చేపట్టినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. శుక్రవారం స్థానిక నాయుడు వీధి సచివాలయం లో జగనన్న ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు. ఆరోగ్య సమస్యల్ని బట్టి చికిత్స కోసం సూచనలు చేస్తారని చెప్పారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ శివకుమార్, వైస్ చైర్మన్ లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరిరఘు, రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, ఇంఛార్జి కమిషనర్ సూరి నాయుడు పాల్గొన్నారు. సీతానగరం: జగనన్న ఆరోగ్య సురక్షపై అందరికీ అవగాహన ఉండాలని ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్ ఎన్ ప్రసాద్ అన్నారు. మండలంలోని అంటిపేట గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష అవగాహన సదస్సును నిర్వహించారు. ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో తహశీల్దార్ ఎంవి రమణ, గృహ సారథులు, మాజీ జెడ్‌పిటిసి అంబటి కృష్ణంనాయుడు, ఎంపిటిసి సేనపతి నిర్మల, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.తిరుపతిరావు, సర్పంచులు, గృహసారథులు, వాలంటీర్లు, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పాలకొండ రూరల్: లుంబూరు గ్రామ పంచాయితీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గడప గడపకు వెళ్లి కుటుంబ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి, యాప్‌లో డేటా ఎంట్రీ చేయిస్తున్న ఎంపిడిఒ జె.ఉమా మహేశ్వరి, సర్పంచ్ తిర్లంగి ఉపేంద్ర కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇంఛార్జి పంచాయతీ సెక్రటరీ సింహాచలం, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్స్ పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఎల్విన్ పేట పంచాయతీ జగనన్న సురక్ష కార్యక్రమంపై సర్పంచి ఆర్ చైతన్య స్రవంతి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎల్విన్ పేట సచివాలయం 1, 2 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 16న మెడికల్ సర్వే ప్రారంభమవుతుందని, 31న ఎల్విన్ పేట సచివాలయం 1 లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఉన్నారు. మండలంలోని పి ఆమిటీ పంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమం పై ఏపీడి సత్యం నాయుడు ప్రచారం నిర్వహించారు. జగనన్న సురక్ష ప్రాముఖ్యత, మెడికల్ క్యాంపులు ఏర్పాటు గురించి గిరిజనులకు వివరించారు. కురుపాం : జగనన్న సురక్ష పథకంపై పంచాయతీ కార్యదర్శులకు, ప్రజాప్రతినిధులకు, వైద్య సిబ్బందికి అవగాహన ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిడిఒ వివి శివరామప్ప ఆధ్వర్యంలో జరిగిన జగనన్న సురక్షపై అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం గూర్చి ప్రతి ఇంటికి వెళ్లి పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. ఎంపిపి శెట్టి పద్మావతి మాట్లాడుతూ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఒక్క వ్యక్తి వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ నోడల్ అధికార్ డాక్టర్ ఎం,వినోద్ కుమార్, డిటిఎ సాంబమూర్తి, జెడ్‌పిటిసి జి.సుజాత, జిల్లా కోప్సన్ సభ్యులు షేక్ నిషార్, వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వైస్ ఎంపిపిలు అన్నాజీరావు, రంగారావు, అయ్యరకల కార్పొరేషన్ డైరెక్టర్ జి.విజయచంద్రశేఖర్, మండల కన్వీనర్ ఐ.గౌరీ శంకర్, ఎంపిటిసి సభ్యులు వి.బంగారు నాయుడు, టీవీఎస్ స్వామియోజులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










