Oct 12,2023 20:37

సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి కృష్ణారావు

 ప్రజాశక్తి -గరుగుబిల్లి :  మండలంలో గొట్టివలస రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 279 గల అటవీశాఖ భూమిని సర్వే చేసేందుకు రైతులు సహకరించాలని ఆర్‌డిఒ హేమలత అన్నారు. ఆ భూమిని అటవీశాఖ కు కేటాయించినందున సర్వే చేయడాన్ని రైతులు వ్యతిరేకించడం సరికాదని అన్నారు. గురువారం రైతులతో తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌డిఒ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధిత రైతులు ఆదివారం లోపు అటవీ శాఖకు కేటాయించిన భూమిపై సర్వే డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, రెవిన్యూ, ఉద్యానశాఖ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు తమ భూమిని చూపించి సర్వే చేయించుకోవాలని. సర్వే అన్నది చేయించకపోతే ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములపై రైతులు లేరని చెప్పి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డి-పట్టా కలిగిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నష్టపరిహారాన్ని గాని, వేరొక చోట భూమిని ఇవ్వడం గానీ జరుగుతుందని అన్నారు. ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆక్రమణ భూమి విడిచిపెట్టాలని తెలిపారు.
చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షించడం తప్పదు
ఈ కొండపై ఏర్పాటు చేసుకున్న క్రైస్తవులు ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ర్యలు చేపడితే వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి కెవి కృష్ణారావు అన్నారు. మతపరంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను ఆదివారం లోపు తీసివేయాలని తెలిపారు. అందుకు రెవిన్యూ డిపార్ట్మెంట్‌ సహకరించాలని సిఐ సిహెచ్‌ ప్రసాద్‌ అన్నారు. కార్యక్రమంలో ఇంఛార్జి తహశీల్దార్‌ పిఎస్‌ఎల్‌. కుమార్‌, ఎస్‌ఐలు ఎం రాజేష్‌, కళాధర్‌, అనీష్‌ అలాగే రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.