Apr 17,2023 22:02

తహశీల్దార్‌తో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : ఆటో కార్మికులకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు తమ డమాండ్లతో కూడన వినతపత్రాన్ని తహశీల్దార్‌ స్వర్ణలతకు సమ ర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ పట్టణంలో దాదాపుగా 700 మంది ఆటో కార్మికులు ఉన్నారని వీరు స్వయం ఉపాధితో రోజు వారి బాడుగ 300 రూపాయలతో వీరి కుటుంబం పోషించుకుంటున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి ఇల్లు లేక బాడుగ ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరికి ఇంటి స్థలం కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూ బకాసురులతో కుమ్మక్కై పెనుకొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాల గురవుతున్న కూడా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.వెంటనే స్పందించి అధికారులు స్పందించి ఆటో కార్మికులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి ,మహబూబ్బాషా, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప ,షరీఫ్‌ ,రెడ్డప్పరెడ్డి, శ్రీరాములు ,మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.