బాధితురాలికి బ్యాగ్ అందజేస్తున్న ఆటో డ్రైవర్
ఆటో డ్రైవర్ నిజాయితీ
ప్రజాశక్తి - బనగానపల్లె
ఆటో డ్రైవర్ సుధాకర్ కు బ్యాగు దొరకడంతో పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామిరెడ్డికి అప్పజెప్పి తన నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం మండలంలోని చేరువుపల్లె గ్రామానికి చెందిన జమీదాబి అనే మహిళ పట్టణంలో తన బ్యాగు పొగుట్టుకోగా ఆ బ్యాగు ఆటో డ్రైవర్ సుధాకర్ కు దొరికినది. బ్యాగులో నగదు,ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ బ్యాగు ఆటో డ్రైవర్ సుధాకర్ కు దొరకగా సుధాకర్ బనగానపల్లె పోలీసు స్టేషన్ లో ఎస్ఐ రామిరెడ్డికి అప్పజెప్పారు. ఎస్సై రామిరెడ్డి జమీదాబి మహిళను పిలిపించి బ్యాగును ఆటో డ్రైవర్ ద్వారా ఆమెకు అప్పగించారు. నిజాయితీగా బ్యాగును అందజేసిన ఆటో డ్రైవర్ సుధాకర్ ను ఎస్సై రామిరెడ్డి, పోలీసులు అభినందించారు.










