చికిత్స పొందుతున్న వరలక్ష్మి
పార్వతీపురంరూరల్: మండలంలోని లచ్చిరాజుపేట కూడలిలో శుక్రవారం ఆటోను బైక్ ఢకొీనడంతో ఇరువురికి గాయాలైనట్లు ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు. సంఘటనలో పెదబొండపల్లి నుంచి తాళ్లబురిడి అటోలో ప్రయాణిస్తున్న మడక వరలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడగా, ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న పత్తిగుళ్ల వంశీ కూడా గాయపడ్డాడు. వీరిరువుర్ని స్థానికులు 108 వాహనంతో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, వైదులు చికిత్స అందిస్తున్నారు.










