అనంతపురం ప్రతినిధి : జనవరి వచ్చిందంటే చాలు సెబేరియన్ పక్షులు అతిథుల్లాగా ఈ ప్రాంతానికి విచ్చేస్తాయి. తిరిగి వర్షాకాలం మొదలవగానే మరో ప్రాంతానికి పయనమై వెళ్లిపోతాయి. అందుకే ఈ ప్రాంతానికి వచ్చే అతిథులుగా పక్షులను పీలుచకుంటూ ఉంటారు. సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలంలోని వీరాపురం సైబేరియన్ పక్షుల విడిది కేంద్రంగా పిలుచుకుంటారు. ఈ పక్షులు సైబేరియన్ ప్రాంతం నుంచి వస్తాయని చెబుతున్నప్పటికీ కచ్చితంగా అక్కడి నుంచే అని చెప్పలేం. దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నట్టుగా పర్యావరణవేత్తలు చెబుతుంటారు. పెద్ద ఎత్తున పక్షల వలన ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ ప్రసిద్ధి. పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వచ్చి వీటిని చూసి వెలుతుంటారు.
ఈ ఏడాది అధికంగా వచ్చిన పక్షులు
వరుసగా రెండు సంవత్సరాలుగా జిల్లాలో మంచి వర్షాలు పడ్డాయి. దీంతో పక్షులు విడిది ఉండే చిలమత్తూరు మండలంలోనూ వీరాపురం, వెంకటాపురం చెరువుల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. నీరు పుష్కలంగా ఉండటంతో ఈ ఏడాది పక్షులు కూడా ఎక్కువగానే ఇక్కడికి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు వేల వరకు వచ్చే పక్షులు ఈసారి నాలుగు వేలకుపైగా వచ్చాయి. ఈ పక్షులు సాధారణంగా ప్రాంతానికి జనవరి నెలలో వస్తాయి. వచ్చి చెట్లపైనా గూళ్లు ఏర్పాటు చేసుకుని వాటిల్లో గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఈ పక్షులకు కొంత పెద్దగా అయిన తరువాత జూన్ నుంచి జులై మాసంలో తిరిగి పయనమైపోతాయి. ఒక్కో పక్షి సగటున నాలుగైదు గుడ్లు పెడుతుంది. వీటిల్లో మూడు పక్షల వరకు పొదుగుతుంది. ఈ రకంగా ఈ ఏడాది పిల్ల, పెద్ద పక్షలు అన్నీ కలిపి పది వేల వరకు అయినట్టు అంచనా. ఇంత పెద్దఎత్తున పక్షులు రావడం ఒకింత సంతోషించదగ్గ విషయం కాగా వాటి ఆహార సమస్య, సంరక్షణ సమస్యగా మారింది.
ఆహారం సరిపడక పక్షుల అరణ్యరోదన
పిల్లలను పొదిగి పెద్దగ చేసే క్రమంలో ఆహారం అధికంగా పక్షులకు అవసరమవుతోంది. ఒక్కో పక్షికి సగటున 500 గ్రాముల వరకు ఆహారాన్ని తీసుకుంటుంది. ఇందులో 90 శాతం వరకు చేపలే ఉంటాయి. తక్కినవి చూస్తే కప్పలు, పాములూ ఉంటాయి. పక్షులు ఈ ఏడాది అధిక కావడంతో ఆహారం కొరత సమస్య వాటికి ఏర్పడుతోంది. దీంతో ఆహారం లేక కొన్ని పక్షులు ఎగరలేక కిందపడిపోతున్నాయి. వీటి సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత అటవీ శాఖ చూడాల్సి ఉంది. కాని అటవీశాఖకు నిధుల కొరత వెంటాడుతున్నట్టు సమాచారం. దీంతో పక్షుల సంరక్షణ ఆగమ్య గోచరంగానే మారింది. దీని కోసం ప్రత్యేకంగా నియమించిన వేణుగోపాల్‌రెడ్డి అనే వాచ్ వార్డుయే ప్రకృతి ప్రేమికుల సహకారంతో వాటిని సంరక్షించే బాధ్యత చూస్తున్నారు. గతంలో వీటి సంరక్షణ కోసం రూ.80 లక్షలతో ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు పంపారు.
సైబీరియన్ పక్షులు










