Sep 08,2023 21:28

అక్షరం నమూనాలో కూర్చొన్న విద్యార్థినిలు

ప్రజాశక్తి - సీతంపేట :  స్థానిక గిరి జన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరా స్యత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వ హించారు విద్యార్థినిలు అక్షరం లా కూర్చొని పలువుర్ని ఆకట్టు కున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎ.లిల్లీరాణి మాట్లాడుతూ అక్షరాలు అందరికీ నేస్తాలని అన్నారు. జ్ఞానాన్ని అందించేవి అక్షరాలని చెప్పారు. తల్లి ప్రపంచానికి పరిచయం చేస్తే అక్షరం సమాజానికి పరిచయం చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.