ఆర్థిక సాయం అందజేస్తున్న భీమిరెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
కర్నూలులోని గౌరీ గోపాల్ ఆస్పత్రిలో గుండె జబ్బుతో చికిత్స పొందుతున్న కమ్మరి అన్నయ్యకు వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సలహా సంఘం మండల కోశాధికారిగా కుమ్మరి అన్నయ్య పని చేస్తున్నారు. గుండె జబ్బుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల తరఫున భీమిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని రూ.15 వేల ఆర్థిక సహాయం అందించి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసిపి కల్లుదేవకుంట నాయకులు సుంకన్న, బసాపురం వార్డు సభ్యులు బడేసాబ్ ఉన్నారు.










