ప్రజాశక్తి - సీతానగరం :ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల నాయకులు జి.వెంకటరమణ కోరారు. సీతానగరం, పెదఅంకలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాడే సందర్భంగా వినుతుల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులు, పని భారం పెరిగిందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రెడ్డి లక్ష్మునాయుడు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
కొమరాడ : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు కొమరాడ, కూనేరు రామభద్రపురం పిహెచ్‌సిల వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం వైద్యాధికారులకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు రాజేశ్వరి, పార్వతి, హైమా, గౌరి, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పాచిపెంట : ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నాగవేణి, కె.నిర్మల అధ్యక్షతన పాచిపెంట, గురువు నాయుడుపేట పిహెచ్‌సి వద్ద నిరసన తెలిపారు. అనంతరం వైద్యాధికారులకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కె.మంజుల, పి.నిర్మల, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మంచాల శ్రీనివాసరావు, పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










