Oct 18,2023 20:06

ఉద్యోగులకు ప్రశంస పత్రం ఇస్తున్న డిపో మేనేజర్‌

ప్రజాశక్తి - ఆదోని
ఎపిఎస్‌ఆర్‌టిసి లాభాలు ఆర్జించడంలో ప్రతి ఉద్యోగీ పాత్ర కీలకమని డిపో మేనేజర్‌ మహ్మద్‌ రఫీక్‌ తెలిపారు. బుధవారం ఆదోని డిపో గ్యారేజీలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అధిక డీజీల్‌ ఆదా చేసిన డ్రైవర్లు వీరేష్‌, షరీఫ్‌, నాగేష్‌, అత్యధిక ఆదాయం ఆర్జించిన కండెక్టర్లు మహేంద్రమ్మ, వీరేషప్ప, కృష్ణయ్య, హంపయ్యను నగదు బహుమతులతో సన్మానించినట్లు తెలిపారు. అలాగే ఉరుకుంద జాతరలో ఉత్తమ సేవలందించిన ఎస్‌డిఐ రామలింగప్ప, కండెక్టర్లు మహేశ్వరప్ప, కార్తవ రాయుడు, పార్వతేషా, మెకానిక్‌ చెన్న కేశవ, అసిస్టెంట్‌ మెకానిక్‌ రమేష్‌ను అభినందించారు. ప్రతి ఉద్యోగీ వీరిని ఆదర్శంగా తీసుకొని సంస్థ లాభాల్లోకి తీసుకు రావడంలో భాగస్వాములు కావాలని కోరారు.