Mar 24,2023 20:45

mokkalu natutunna tatineni padmavathi

ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ప్రజాశక్తి-గన్నవరం
ఆర్టీసీ విజయవాడ జోనల్‌-2 చైర్మన్‌ తాతినేని పద్మావతి శుక్రవారం గన్నవరం డిపోలో మొక్కలు నాటారు. డిపోలో అన్ని సెక్షన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. డిపో మేనేజర్‌ శివాజీ అధ్యక్షతన డిపో గ్యారేజ్‌లో మీటింగ్‌ నిర్వహించారు. పద్మావతి ప్రసంగిస్తూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయం అని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి కార్మికులు, అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డిపో ఎంప్లాయీస్‌ 100 మంది పాల్గొన్నారు. అనంతరం పద్మావతిని కార్మిక సంఘాల నాయకులు సత్కరించారు. యార్డ్‌ స్విపింగ్‌ చేసే వర్కర్స్‌కి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టిఐ మధు, ఎఎంఎఫ్‌ రజనీకాంత్‌, సూపర్‌వైజర్లు, యూనియన్‌ నాయకులు కోటేశ్వరరావు, ఎఎస్‌ రావు, సంజీవరావు, సిబ్బంది పాల్గొన్నారు.